1 00:00:11,053 --> 00:00:14,056 లార్ని మైకేల్స్ సమర్పించు 2 00:00:41,291 --> 00:00:44,711 ష్మిగడూన్ కి మూడు ఏళ్ళ తొమ్మిది నెలల ముందు 3 00:00:47,297 --> 00:00:49,091 అతను పెట్టెను తెరిచాడా? 4 00:00:50,509 --> 00:00:52,386 ఇందులో బట్టలు లేని జనాలు ఉంటారని నువ్వు చెప్పలేదే. 5 00:00:52,469 --> 00:00:54,680 నాకు తెలీదు. ఆ విషయం డేవ్ చెప్పలేదు. 6 00:00:55,472 --> 00:00:58,016 బాబోయ్, డేవ్ బట్టలు లేకుండా ఉంటాడా? 7 00:00:59,059 --> 00:01:02,020 అతని పాత్ర పేరు, "కవచం లేని సత్యాన్వేషి," 8 00:01:02,104 --> 00:01:03,438 కాబట్టి నగ్నంగానే ఉంటాడనుకుంటా. 9 00:01:03,522 --> 00:01:05,147 డేవ్ ని నగ్నంగా నేను చూడలేను. 10 00:01:05,232 --> 00:01:06,567 నువ్వు చూడగలవు, మనం డాక్టర్లం. 11 00:01:06,650 --> 00:01:08,986 నేను మోకాళ్ల ఆపరేషన్లు చేస్తాను. ఇంకా అంత ఎత్తుకు నేను ఎదగలేదు... 12 00:01:09,069 --> 00:01:10,320 అదుగో డేవ్. 13 00:01:10,404 --> 00:01:11,405 ఇక వెళ్లిపోదాం. 14 00:01:12,239 --> 00:01:13,448 వెళ్లిపోదాం. 15 00:01:13,949 --> 00:01:16,660 ఎందుకంటే లోపల ఏముందో నాకు తెలీదు. 16 00:01:16,743 --> 00:01:17,744 మన్నించండి. 17 00:01:17,828 --> 00:01:19,496 -మన్నించండి. -క్షమించండి. 18 00:01:19,580 --> 00:01:21,331 -మన్నించు. -అబద్ధాలకోరువి. 19 00:01:21,415 --> 00:01:23,125 -నేను ప్రయత్నిస్తున్నాను. -త్వరగా పద. 20 00:01:23,208 --> 00:01:24,459 కాలివేళ్ల మీద నడువు. 21 00:01:29,756 --> 00:01:31,175 ద లోన్లీ రూమ్ థియేటర్ 22 00:01:33,844 --> 00:01:35,220 దేవుడా. 23 00:01:37,431 --> 00:01:38,640 వావ్. 24 00:01:39,433 --> 00:01:41,143 ఇది చాలా బాగుంది. 25 00:01:41,935 --> 00:01:43,145 వోవ్! పట్టేసుకున్నా. 26 00:01:44,521 --> 00:01:45,647 ఐ లవ్ యూ. 27 00:01:46,773 --> 00:01:48,692 నన్ను మన్నించు. అంటే... 28 00:01:48,775 --> 00:01:50,652 నువ్వేమీ ఇబ్బంది పడనక్కర్లేదు. 29 00:01:50,736 --> 00:01:54,406 అదీగాక, మనం డేవ్ పురుషాంగాన్ని చూసిన రాత్రే అది చెప్పడం వింతగా ఉంది, కాబట్టి... 30 00:01:54,489 --> 00:01:55,866 ఐ లవ్ యూ టూ. 31 00:02:08,503 --> 00:02:09,505 క్షమించాలి. 32 00:02:09,588 --> 00:02:12,966 నేను తల్లిదండ్రులను గురువారాలు మూడు గంటల నుండి అయిదు గంటల మధ్యలోనే కలుసుకుంటాను. 33 00:02:13,050 --> 00:02:14,426 మంచిది, నేను తండ్రిని కాదు. 34 00:02:15,844 --> 00:02:18,222 జాష్ స్కిన్నర్ ని. డాక్టర్ జాష్ స్కిన్నర్ ని. 35 00:02:18,305 --> 00:02:20,182 మీరెవరో నాకు తెలుసు. 36 00:02:21,183 --> 00:02:23,310 పాపం ఆ బెట్సీ మెక్ డోనా మనస్సును విరిచేసిన వ్యక్తి మీరే, 37 00:02:23,393 --> 00:02:25,395 ఆ తర్వాత ఊర్లోని ప్రతీ అమ్మాయితో వంతెన దాటడం ద్వారా 38 00:02:25,479 --> 00:02:27,105 భార్యను సంపాదించాలనే పనికిమాలిన ప్రయత్నం చేశారు. 39 00:02:27,189 --> 00:02:29,775 మరి ఆ ప్రయత్నం విజయవంతమైనదా? మంచి భార్య దొరికిందా? 40 00:02:29,858 --> 00:02:31,401 ఇంకా వెతికే పనిలోనే ఉన్నాను. 41 00:02:31,485 --> 00:02:33,153 ఇక్కడ వెతుకుతూ మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. 42 00:02:33,237 --> 00:02:35,822 మీరు వంద డాలర్లు ఇచ్చినా మీతో ఆ వంతెనని నేను దాటను. 43 00:02:35,906 --> 00:02:38,075 నిజానికి, నేను ఉండటానికి ఒక చోటు కోసం వెతుకుతున్నాను. 44 00:02:38,158 --> 00:02:40,118 పాఠశాల మీద ఒక గది అద్దెకి ఉందని విన్నాను. 45 00:02:40,202 --> 00:02:41,453 మీరు విన్నది నిజం కాదు. 46 00:02:41,537 --> 00:02:44,331 ఇక, మీరు బయలుదేరితే, నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, అవి చేసుకుంటాను. 47 00:02:44,414 --> 00:02:46,625 అయితే, మిమ్మల్ని కూడా మిల్డ్రెడ్ లేటన్ బెదిరించింది అన్నమాట. 48 00:02:47,417 --> 00:02:48,418 మిల్డ్రెడ్ లేటన్? 49 00:02:48,502 --> 00:02:52,798 తను నా ప్రేయసిని... అదే మాజీ ప్రేయసిని, నన్ను మా హోటల్ నుండి గెంటేయించింది, 50 00:02:52,881 --> 00:02:55,551 అంతేకాకుండా, ఊర్లోని వాళ్లు మాకు నీడ ఇవ్వకుండా అందరినీ బెదిరించింది. 51 00:02:55,634 --> 00:02:57,135 దేవుడా, ఆవిడ బ్రహ్మరాక్షసి. 52 00:02:57,219 --> 00:02:58,762 అంతేకాదు, నా తరగతి విషయంలో 53 00:02:58,846 --> 00:03:01,223 పదేపదే కలుగజేసుకొని నేనేం బోధించాలో నాకే చెప్తూ ఉంటుంది. 54 00:03:01,306 --> 00:03:04,560 వన్యపూల మీద నేను రాసిన పుస్తకాన్ని తీసుకొని కాడలన్నిటినీ కనబడకుండా గీసేసింది. 55 00:03:04,643 --> 00:03:06,061 అయితే, మీతో కూడా తనకి సమస్య ఉందన్నమాట. 56 00:03:07,062 --> 00:03:08,480 అవును, అందులో ఆశ్చర్యమేమీ లేదులే. 57 00:03:09,314 --> 00:03:12,192 అసలు తను ఎవరు? మొత్తం ఊరంతా తన గుప్పెట్లో ఉంటుందా? 58 00:03:12,276 --> 00:03:14,653 దాదాపుగా. కానీ తన పెత్తనం నా దగ్గర సాగదు. 59 00:03:15,445 --> 00:03:17,906 ఆ విషయం నిరూపించడానికి నా దగ్గర ఒక మంచి మార్గముంది. 60 00:03:23,412 --> 00:03:27,749 ఇక్కడ ఒక సహాయకుడు ఉంటే నాకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటా. 61 00:03:29,293 --> 00:03:30,669 గదికి ప్రతిఫలంగా. 62 00:03:30,752 --> 00:03:33,005 సరే. సహాయకుడు. 63 00:03:33,088 --> 00:03:37,217 నన్ను మించిన సహాయకుడు దొరకడు. నా ఇంట్లో పటాలన్నింటినీ ఒక గంటలో వేలాడదీసేశాను. 64 00:03:38,135 --> 00:03:40,387 కంటి చూపుతో పసిగట్టేయగలను. అది మామూలు విషయం కాదు. 65 00:03:40,971 --> 00:03:43,056 మీరు సరైనోడు అని మీకు అనిపించి ఉంటుంది. 66 00:03:43,140 --> 00:03:45,184 రేపు ఉదయం తొమ్మిది గంటలకు మీరు పనిలో చేరవచ్చు. 67 00:03:45,267 --> 00:03:47,186 ఇక మీరు బయలుదేరితే, నేను నా పని చూసుకుంటాను. 68 00:03:47,269 --> 00:03:48,520 అలాగే. 69 00:03:49,938 --> 00:03:50,939 ధన్యవాదాలు. 70 00:04:03,118 --> 00:04:05,078 -ఎనిమిదికే వచ్చేయండి. -అలాగే. 71 00:04:07,122 --> 00:04:08,999 నర్సుకు ఈ లక్షణాలు ఉండాలి: 72 00:04:09,082 --> 00:04:13,879 కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, నా ఆదేశాలు అన్నింటినీ తూచా తప్పకుండా పాటించడం. 73 00:04:14,630 --> 00:04:15,839 తప్పకుండా. 74 00:04:16,632 --> 00:04:21,428 అయితే, డాక్టర్ లోపెజ్, మీ దగ్గర చాలా మంది నర్సులు పనిచేశారా? 75 00:04:22,221 --> 00:04:23,222 పనిచేశారు. 76 00:04:24,431 --> 00:04:26,642 ఇప్పుడు నేను మీకు నా పరికరాలను చూపుతాను. 77 00:04:27,768 --> 00:04:29,770 దీన్ని ఆబ్స్ట్రెట్రిక్ పర్ఫొరేటర్ అంటారు. 78 00:04:30,687 --> 00:04:33,649 అవునా? చూస్తుంటే రొయ్యలని తినడానికి వాడే పరికరంలా ఉంది. 79 00:04:36,109 --> 00:04:37,444 నాన్నా? 80 00:04:38,278 --> 00:04:41,031 క్షమించు, బాబూ. ఒక వస్తువు తీసుకుందామని వచ్చాను. 81 00:04:41,740 --> 00:04:43,283 ఏం తీసుకున్నావు? 82 00:04:44,660 --> 00:04:46,578 ఏంటది? చూపు. 83 00:04:48,956 --> 00:04:52,709 నాన్నా, అది సర్జికల్ లూబ్రికెంట్. దాని అవసరం నీకేంటి? 84 00:04:53,460 --> 00:04:56,630 -అది వ్యక్తిగత విషయం. -అది నాది అయినప్పుడు వ్యక్తిగతం కానే కాదు. 85 00:04:56,713 --> 00:04:58,757 కమాన్. వాళ్లని తీసుకోనివ్వండి. 86 00:04:58,841 --> 00:05:02,052 ఇప్పుడు మీ వల్ల నా కొత్త నర్సు నా అధికారాన్ని ప్రశ్నిస్తోంది. 87 00:05:02,135 --> 00:05:06,181 సరే. నాకూ మీ అమ్మకి కోరికలు కలుగుతున్నాయి, 88 00:05:06,265 --> 00:05:08,725 చివరిసారి వాడినప్పుడు చాలా బాగా ఉపయోగపడింది, కాబట్టి... 89 00:05:08,809 --> 00:05:11,812 -నాన్నా, ఒక అమ్మాయి ముందు ఏంటా మాటలు. -పర్వాలేదులే. 90 00:05:11,895 --> 00:05:14,481 మీది సరసాలాడే వయస్సు కాదు. అది తగినది కాదు. 91 00:05:14,565 --> 00:05:15,816 వెంటనే అక్కడ పెట్టేసేయ్. 92 00:05:19,903 --> 00:05:22,906 మన్నించండి. పని మధ్యలో అంతరాయాలు నాకు నచ్చవు అన్నమాట. 93 00:05:22,990 --> 00:05:26,118 -డాక్ లోపెజ్, మన్నించండి, కానీ... -అమ్మాయి, నీకు సాయపడలేనని చెప్పా కదా. 94 00:05:26,201 --> 00:05:27,202 -కానీ నేను... -నాన్సీ! 95 00:05:27,286 --> 00:05:30,205 పెళ్లి కాకుండానే తల్లి కావాలని నువ్వు నిశ్చయించుకుంటే, అది నీ సమస్య. 96 00:05:30,289 --> 00:05:33,292 దానితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇప్పుడు దయచేసి నా ఆఫీసు నుండి వెళ్లిపో. 97 00:05:33,375 --> 00:05:34,293 ఒక్క నిమిషం, ఏంటి? 98 00:05:36,003 --> 00:05:37,754 అసలు మీ సమస్య ఏంటి? 99 00:05:37,838 --> 00:05:39,756 ఆ అమ్మాయిని అలా మీరు నిరాదరించలేరు. 100 00:05:39,840 --> 00:05:42,134 నా రోగిగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో నాకు సర్వ హక్కులూ ఉన్నాయి. 101 00:05:42,217 --> 00:05:44,344 కానీ ఈ ఊరిలో మీరు ఒక్కరే కదా డాక్టర్. 102 00:05:47,139 --> 00:05:48,140 ఎపిఫనీ. 103 00:05:48,223 --> 00:05:53,145 ఎ-పి-ఐ-పి-హెచ్-ఎ-ఎన్-వై. ఎపిఫనీ. 104 00:05:53,228 --> 00:05:54,563 బాగా చెప్పావు, జనీతా. 105 00:05:54,646 --> 00:05:57,482 టామీ, నువ్వు "కథార్సిస్"ని చెప్పాలి. 106 00:05:58,400 --> 00:06:00,444 -కథార్సిస్, సి-ఎ... -హేయ్! 107 00:06:01,528 --> 00:06:04,823 పిల్లలూ, మన కొత్త సహాయకుడు, డాక్టర్ స్కిన్నర్ కి అందరూ శుభోదయం చెప్పండి. 108 00:06:04,907 --> 00:06:08,035 శుభోదయం, డాక్టర్ స్కిన్నర్. 109 00:06:09,536 --> 00:06:10,537 హేయ్, పిల్లలు. 110 00:06:12,372 --> 00:06:13,373 ఏంటి సంగతి? 111 00:06:15,292 --> 00:06:16,293 మరి, నా పనేంటి? 112 00:06:16,376 --> 00:06:19,129 సరుకుల గది యొక్క తలుపు కొన్ని వారాల నుండి పని చేయడంలేదు. 113 00:06:19,213 --> 00:06:20,172 నేను చూసుకుంటాగా. 114 00:06:20,255 --> 00:06:22,174 ఇక, టామీ, నువ్వు చెప్పు. 115 00:06:23,634 --> 00:06:26,053 -నువ్వు "కథార్సిస్"ని చెప్పాలి. -మిస్ టేట్? 116 00:06:27,179 --> 00:06:30,098 ఇది బాగా ఇరుక్కుపోయింది. ఇంకేమైనా పనులు ఉన్నాయా? 117 00:06:30,182 --> 00:06:31,517 అయితే ప్రయత్నం చేయడం మానేస్తారా? 118 00:06:31,600 --> 00:06:34,186 లేదు, నేనేమీ మానేయడంలేదు. మరో పని చేయాలనుకుంటున్నాను, అంతే. 119 00:06:34,269 --> 00:06:36,647 అంటే, ప్రయత్నం చేయడం మానేయడమే కదా. 120 00:06:36,730 --> 00:06:39,483 పిల్లలూ, ఈ విషయంలో షేక్స్పియర్ ఏమన్నారు? 121 00:06:40,067 --> 00:06:42,736 "చావుకు ముందు పిరికివారు చాలా సార్లు చనిపోతారు; 122 00:06:42,819 --> 00:06:45,948 అదే ధీరులు ఒక్కసారి మాత్రమే చనిపోతారు." 123 00:06:46,698 --> 00:06:51,787 షేక్స్పియర్. ఎంతో వివేకవంతమైనది, చాలా బాగా వ్యక్తీకరించబడింది. 124 00:06:51,870 --> 00:06:53,121 అసలు దానర్థం ఏంటి? 125 00:06:53,705 --> 00:06:57,000 సమస్యకు పరిష్కారం వెతకకుండా, తప్పించుకోవడం వల్ల ఎప్పటికైనా నష్టమే అని దానర్థం. 126 00:06:57,793 --> 00:07:00,295 దాన్ని ఇలా వివరించి చూస్తాను. 127 00:07:01,046 --> 00:07:04,883 నిజంగానా, పాడి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అర్థమైపోయింది. 128 00:07:04,967 --> 00:07:11,849 మీరు మీ పనిని మీ మనస్సంతా పెట్టి చేయాలి 129 00:07:11,932 --> 00:07:15,894 మొదలుపెట్టినదాన్ని పూర్తిచేసిన అమ్మాయిలు, అబ్బాయిలకే 130 00:07:15,978 --> 00:07:18,981 జీవితంలో గొప్ప సంతృప్తి దక్కుతుంది 131 00:07:19,064 --> 00:07:23,402 పని చేయాల్సి వచ్చినప్పుడు సోమరిపోతులు జంకుతారు 132 00:07:23,485 --> 00:07:26,029 ఎందుకంటే అది వారికి సరదా కాదు 133 00:07:26,113 --> 00:07:29,324 కానీ ప్రపంచమంతా మెచ్చే వ్యక్తులు 134 00:07:29,408 --> 00:07:33,036 తమ పనిని పూర్తిచేసేంత వరకు దృష్టి మళ్లించరు 135 00:07:33,120 --> 00:07:35,873 -అవును. -"ఇక నా వల్ల కాదు," అని 136 00:07:36,748 --> 00:07:39,459 అప్పుడుప్పడూ మీకు చెప్పాలనిపించవచ్చు 137 00:07:40,210 --> 00:07:44,715 కానీ సగం జీవించిన జీవితం అసలు జీవితమే కాదు 138 00:07:46,175 --> 00:07:47,176 వద్దు. సరే. 139 00:07:47,259 --> 00:07:54,224 కాబట్టి నా బాధ్యతగా నేనొక మంచి సలాహా ఇస్తున్నాను 140 00:07:54,308 --> 00:07:59,062 నువ్వు ఎప్పుడూ కూడా నీ మనస్సు పెట్టి నీకు చేతనైనంత కృషి చేయాలి 141 00:08:00,314 --> 00:08:03,150 మిస్ టేట్ నిజమే చెప్పారు. మీరు సగం సగం పనులెలా చేస్తారు? 142 00:08:03,233 --> 00:08:04,818 లేదా అర్ధ నేస్తంగా ఎలా ఉంటారు? 143 00:08:04,902 --> 00:08:07,154 ఎందుకు మధ్యలోనే వదిలేస్తుంటారు, డాక్టర్ స్కిన్నర్? 144 00:08:07,237 --> 00:08:08,280 అవును. ఎందుకు? 145 00:08:08,363 --> 00:08:09,364 ముద్దపప్పు 146 00:08:09,448 --> 00:08:11,158 హేయ్, ఇక ఆపండి. ఇది కేవలం ఒక తలుపు, అంతే. 147 00:08:11,241 --> 00:08:12,492 అంతేనా? 148 00:08:13,702 --> 00:08:17,581 -మీరు మీ పనిని -మీరు మీ పనిని 149 00:08:17,664 --> 00:08:21,001 -మీ మనస్సంతా పెట్టి చేయాలి -మీ మనస్సంతా పెట్టి చేయాలి 150 00:08:21,084 --> 00:08:22,461 మొదలుపెట్టినదాన్ని 151 00:08:22,544 --> 00:08:24,338 -పూర్తిచేసిన అమ్మాయిలు, అబ్బాయిలకే -అమ్మాయిలు, అబ్బాయిలకే 152 00:08:24,421 --> 00:08:28,008 -జీవితంలో గొప్ప సంతృప్తి దక్కుతుంది -ద-క్కు-తుం-ది! 153 00:08:28,091 --> 00:08:31,136 పని చేయాల్సి వచ్చినప్పుడు సోమరిపోతులు జంకుతారు 154 00:08:31,220 --> 00:08:34,847 -ఎందుకంటే అది వారికి సరదా కాదు -స-ర-దా! 155 00:08:34,932 --> 00:08:38,184 కానీ ప్రపంచమంతా మెచ్చే వ్యక్తులు 156 00:08:38,268 --> 00:08:41,938 తమ పనిని పూర్తిచేసేంత వరకు దృష్టి మళ్లించరు 157 00:08:42,022 --> 00:08:45,567 -"ఇక నా వల్ల కాదు" అని -"ఇక నా వల్ల కాదు," అని 158 00:08:45,651 --> 00:08:49,196 -అప్పుడుప్పడూ మీకు చెప్పాలనిపించవచ్చు -అప్పుడుప్పడూ మీకు చెప్పాలనిపించవచ్చు 159 00:08:49,279 --> 00:08:51,865 కానీ సగం జీవించిన జీవితం 160 00:08:51,949 --> 00:08:56,036 -అసలు జీవితమే కాదు -అసలు జీవితమే కా-దు! 161 00:08:56,119 --> 00:09:03,043 కాబట్టి నా బాధ్యతగా నేనొక మంచి సలాహా ఇస్తున్నాను 162 00:09:03,126 --> 00:09:07,714 నువ్వు ఎప్పుడూ కూడా నీ మనస్సు పెట్టి నీకు చేతనైనంత కృషి చేయాలి 163 00:09:09,299 --> 00:09:11,468 నీకు పాడటం నచ్చదా? నేను అర్థం చేసుకోగలనులే. 164 00:09:11,552 --> 00:09:13,178 నాకు సంగీతం అంతగా రాదు. 165 00:10:19,369 --> 00:10:21,914 కాబట్టి నా బాధ్యతగా 166 00:10:21,997 --> 00:10:24,416 నేనొక మంచి సలాహా ఇస్తున్నాను 167 00:10:24,499 --> 00:10:27,169 నువ్వు ఎప్పుడూ కూడా నీకు చేతనైనంత కృషి చేయాలి 168 00:10:28,670 --> 00:10:30,839 జీవితం నిన్ను ఎన్నిసార్లు పరీక్షించినా 169 00:10:32,382 --> 00:10:37,012 నువ్వు ఎప్పుడూ కూడా నీ మనస్సు పెట్టి 170 00:10:37,095 --> 00:10:38,347 నీకు చేతనైనంత 171 00:10:38,430 --> 00:10:40,599 కృషి చేయాలి 172 00:10:40,682 --> 00:10:42,851 కృ-షి! 173 00:10:42,935 --> 00:10:44,144 కృషి! 174 00:10:46,730 --> 00:10:48,106 అంతే! 175 00:10:48,815 --> 00:10:51,568 వాళ్లంతా ఎందుకు నవ్వుతున్నారు? అసలు కాస్తంతైనా నవ్వొచ్చే విషయం ఏమైనా జరిగిందా. 176 00:10:56,615 --> 00:11:01,036 ష్మిగడూన్ వివిధ మతాల బేకరీ ఆహార అమ్మకం 177 00:11:02,913 --> 00:11:07,000 ప్రెస్బైటేరియన్ - మెథొడిస్ట్ 178 00:11:20,764 --> 00:11:22,099 ఇక్కడున్న నోరూరించేవాటిలో మీరేమైనా తీసుకుంటారా? 179 00:11:23,392 --> 00:11:25,185 మీరు ఏది బాగుంటుందంటారు? 180 00:11:25,269 --> 00:11:28,063 ఎక్కువ మంది హెలెన్ ప్రిట్ చేసిన ప్లమ్ కేకును లేదా 181 00:11:28,146 --> 00:11:30,107 ఆంట్ పాలీ చేసిన స్పాంజ్ కేకును ఇష్టపడుతున్నారు. 182 00:11:30,190 --> 00:11:33,485 దురదృష్టవశాత్తూ, నేను చేసిన సోమ్ పాపిడి మాత్రం ఎవ్వరికీ నచ్చినట్టులేదు. 183 00:11:33,569 --> 00:11:35,696 నాకు సోమ్ పాపిడి అంటే ప్రాణం. 184 00:11:35,779 --> 00:11:37,239 అవునా? నాకు కూడా. 185 00:11:38,323 --> 00:11:40,033 అవి నాకు తప్ప ఇంకెవ్వరికీ ఇష్టముండవు అనుకున్నానే. 186 00:11:40,742 --> 00:11:42,578 అంటే, అవి అందరూ తినలేరులే. 187 00:11:44,872 --> 00:11:46,665 -నేను రెండు తీసుకుంటాను. -మంచిది. 188 00:11:49,960 --> 00:11:52,796 ఇదిగోండి. నేనొక్కడినే తినడం నాకు నచ్చదు. 189 00:11:52,880 --> 00:11:54,131 ధన్యవాదాలు. 190 00:11:56,550 --> 00:11:58,051 ఆగాగు, హోవార్డ్, నీ డైట్ ని మర్చిపోకు. 191 00:11:58,135 --> 00:12:00,804 అటకలో పడేసిన నీ లూజు ప్యాంట్లను మళ్లీ తీయాల్సిన అవసరం రానివ్వకు. 192 00:12:00,888 --> 00:12:02,431 మన్నించు, మిల్డ్రెడ్. 193 00:12:25,621 --> 00:12:26,830 ఇక్కడున్నావు అన్నమాట! 194 00:12:27,664 --> 00:12:30,167 కంగారు పడకు, నాన్సీ. లేదు, నేను నీకు సాయం చేద్దామనే వచ్చాను. 195 00:12:30,250 --> 00:12:31,877 పుట్టబోయే బిడ్డకి తండ్రి ఇతనేనా? 196 00:12:31,960 --> 00:12:33,879 అవును, మేడమ్. నావికుడు ఫ్రెడ్డీ డ్రిగ్స్ ని. 197 00:12:33,962 --> 00:12:35,714 నీ సేవకు ధన్యవాదాలు. 198 00:12:37,299 --> 00:12:39,676 నువ్వు గర్భవతివి అయ్యుండి ఈ పాకలో నివసిస్తున్నావా? 199 00:12:39,760 --> 00:12:41,595 నాకు పెళ్లి కాకుండా బిడ్డని కనడం మా అమ్మానాన్నలకి ఇష్టం లేదు. 200 00:12:41,678 --> 00:12:43,639 కానీ ఇక్కడికి ఫ్రెడ్డీ వచ్చినట్టు వాళ్ళకి చెప్పకండి. 201 00:12:43,722 --> 00:12:45,265 నాన్సీ, నేనూ నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. 202 00:12:45,349 --> 00:12:47,142 కానీ నావికులైన మేము బూతులు మాట్లాడతామని 203 00:12:47,226 --> 00:12:50,020 నాన్సీ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు... మన్నించండి. 204 00:12:50,103 --> 00:12:51,563 కాబట్టి మేము పెళ్లి చేసుకోలేకపోయాం. 205 00:12:51,647 --> 00:12:53,273 హేయ్. నేను మిమ్మల్ని తప్పుగా అనుకోనులే. 206 00:12:53,357 --> 00:12:56,193 నువ్వూ, నీ బిడ్డా క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికే వచ్చాను. 207 00:12:56,276 --> 00:12:57,444 ఇప్పుడు నీకు ఎన్నో నెల? 208 00:12:57,528 --> 00:13:01,156 నాకు తెలీదు. నాకు చాలా సందేహాలు ఉన్నాయి, కానీ ఎవరిని అడగాలో తెలీదు. 209 00:13:02,574 --> 00:13:04,076 ఉదాహరణకు, బిడ్డ ఎక్కడి నుండి బయటకు వస్తుంది? 210 00:13:04,159 --> 00:13:07,329 రెండు చోట్ల నుండి వస్తుందని అనుకుంటున్నా, కానీ ఆ రెండూ చిత్రంగానే అనిపిస్తున్నాయి. 211 00:13:07,412 --> 00:13:10,457 బిడ్డ నీ యోని నుండి బయటకు వస్తుంది, నాన్సీ. 212 00:13:11,500 --> 00:13:12,501 నిజంగానా? 213 00:13:12,584 --> 00:13:14,670 మేడమ్, అలాంటి భాష నేను కూడా మాట్లాడను. 214 00:13:14,753 --> 00:13:18,090 అది వైద్యపరమైన పదజాలం, ఫ్రెడ్డీ. అందులో భయపడాల్సిందేమీ లేదు. 215 00:13:18,924 --> 00:13:22,261 నీకు సులువుగా అర్థమయ్యేలా చెప్పగలనేమో చూస్తాను. 216 00:13:27,516 --> 00:13:31,395 ఆలుమగలను ఏకం చేసే చోటు యోని 217 00:13:31,478 --> 00:13:34,898 అండాశయంలో మనందరి గుడ్లు ఏర్పడతాయి 218 00:13:35,858 --> 00:13:39,111 వృషణాలలో వీర్యం ఉత్పత్తి అవుతుంది 219 00:13:39,194 --> 00:13:42,948 సర్విక్స్ లో అవి తేలిగ్గా కదలగలవు 220 00:13:43,615 --> 00:13:46,952 ఫాలోపియన్ ట్యూబ్స్ లో అవి రెండూ కలుస్తాయి 221 00:13:47,828 --> 00:13:51,540 గర్భాశయంలో కణాలు పెరగడం ప్రారంభమవుతాయి 222 00:13:51,623 --> 00:13:55,335 ప్లసెంటాని అవి ఇష్టంగా తింటాయి 223 00:13:55,419 --> 00:13:59,131 తినీ తినీ అవి బయటకు వచ్చేస్తాయి, ఎక్కడి నుండి అంటే... 224 00:14:00,507 --> 00:14:02,467 -యోని నుండి? -అంతే! 225 00:14:02,551 --> 00:14:03,635 ఇప్పుడు నాతో కలిసి పాడండి. 226 00:14:05,470 --> 00:14:09,474 -ఆలుమగలను -ఏకం చేసే చోటు యోని 227 00:14:09,558 --> 00:14:13,562 -అండాశయంలో -మనందరి గుడ్లు ఏర్పడతాయి 228 00:14:13,645 --> 00:14:17,441 -వృషణాలలో -వీర్యం ఉత్పత్తి అవుతుంది 229 00:14:17,524 --> 00:14:21,528 -సర్విక్స్ లో -అవి తేలిగ్గా కదలగలవు 230 00:14:21,612 --> 00:14:25,574 -ఫాలోపియన్ ట్యూబ్స్ లో -అవి రెండూ కలుస్తాయి 231 00:14:25,657 --> 00:14:29,328 -గర్భాశయంలో -కణాలు పెరగడం ప్రారంభమవుతాయి 232 00:14:29,411 --> 00:14:32,998 -ప్లసెంటాని -అవి ఇష్టంగా తింటాయి 233 00:14:33,081 --> 00:14:37,753 తినీ తినీ అవి యోని నుండి బయటకు వచ్చేస్తాయి 234 00:14:42,216 --> 00:14:44,384 అబ్బా! నీ యెంకమ్మ. 235 00:14:48,847 --> 00:14:51,558 అందరూ మాట్లాడుకుంటున్న స్కిన్నర్ ఫీలింగ్ అంటే ఇదే అయ్యుంటుంది. 236 00:14:51,642 --> 00:14:55,604 హేయ్. నేను నా మనస్సు పెట్టి నాకు చేతనైనంత చేస్తున్నానంతే. 237 00:14:55,687 --> 00:14:58,440 కానీ, తలుపును తెరవలేక మీరు చతికిలబడ్డారు. 238 00:14:59,149 --> 00:15:01,485 బహుశా పనిముట్ల మీద మీ దాడి రేపు మరోసారి కొనసాగిసించాలేమో? 239 00:15:02,903 --> 00:15:04,363 ఒరేయ్! 240 00:15:04,446 --> 00:15:05,948 కాల్చవద్దు! 241 00:15:06,031 --> 00:15:07,324 నేను కాల్చడం లేదు. 242 00:15:07,407 --> 00:15:09,409 నువ్వు నాతో, బెట్సీతో తక్షణమే చర్చికి బయలుదేరి, 243 00:15:09,493 --> 00:15:10,869 బెట్సీని పెళ్లి చేసుకోవాలి. 244 00:15:10,953 --> 00:15:11,912 ఏంటి? 245 00:15:11,995 --> 00:15:15,457 హేయ్! నా మాట వినండి, ప్యాట్రిక్ మెక్ డూగల్ మెక్ డోనా. 246 00:15:15,541 --> 00:15:16,959 ఇలా ఒక తుపాకీని ఊపుకుంటూ 247 00:15:17,042 --> 00:15:18,669 ఒక పిచ్చివాడిలా నానాహంగామా చేస్తూ నా తరగతిలోకి రావద్దు. 248 00:15:18,752 --> 00:15:19,753 నా మాట అర్థమైందా? 249 00:15:19,837 --> 00:15:21,171 అయింది, మేడమ్. 250 00:15:21,255 --> 00:15:23,131 మీరు మగాళ్లని బెదిరించి మీ కూతురుకిచ్చి 251 00:15:23,215 --> 00:15:25,968 పెళ్లి చేయాలనుకుంటున్నారే, మీ కూతురు గురించి మరీ అంత తక్కువగా ఆలోచిస్తున్నారా? 252 00:15:26,051 --> 00:15:28,470 -అవునా, నాన్నా? -అంటే, నేనేమనుకున్నానంటే... 253 00:15:28,554 --> 00:15:31,265 మీ బుర్రలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో నాకు అస్సలు అర్థం కావడంలేదు. 254 00:15:31,348 --> 00:15:34,685 కానీ మీరు ఇప్పుడు మీ ఇంటికి వెళ్లి, మీ ప్రవర్తన విషయంలో బాగా ఆలోచించుకొని, 255 00:15:34,768 --> 00:15:36,895 మీ కూతురి జీవితాన్ని తన ఇష్ట ప్రకారం జీవించనివ్వండి. 256 00:15:36,979 --> 00:15:39,106 -నేను చెప్పింది బాగా అర్థమైందా? -అయింది, మేడమ్. 257 00:15:40,065 --> 00:15:41,066 నేను నా తుపాకీని తీసుకోవచ్చా? 258 00:15:41,149 --> 00:15:44,778 మీరు గుణపాఠం నేర్చుకున్నారని నాకు అనిపించినప్పుడు ఇస్తాను. ఇక బయలుదేరండి. 259 00:15:52,578 --> 00:15:53,579 ధన్యవాదాలు. 260 00:15:54,288 --> 00:15:58,625 ఈ బుర్రలేని వాళ్ళ మధ్య బుర్ర ఉన్న వాళ్ళు ఒక్కరే ఉండటం చాలా కష్టంగా ఉండుంటుంది. 261 00:15:58,709 --> 00:16:01,795 వాళ్లేమంత చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ తీరు, నమ్మకాలు వేరు, అంతే. 262 00:16:02,754 --> 00:16:05,674 ఈ కాలానికి తగ్గట్టుగా ఉండమని వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంటాను, కానీ... 263 00:16:06,925 --> 00:16:08,427 మీరు బ్రసియర్ అనే పదాన్ని విన్నారా? 264 00:16:09,720 --> 00:16:12,014 -విన్నట్టే ఉన్నాను. -అది ఒక అద్భుతమైన ఆవిష్కరణ, 265 00:16:12,097 --> 00:16:15,184 అది మహిళల రొమ్ములకు రవికల బారి నుండి విముక్తిని కలిగిస్తుంది. 266 00:16:15,267 --> 00:16:16,560 నాకది భలే నచ్చింది. 267 00:16:16,643 --> 00:16:20,355 కానీ మిల్డ్రెడ్, ఇంకా ఆమె చెంచాలు వాటిని బహిష్కరించారు. చాలా హాస్యాస్పదమైన పని అది. 268 00:16:20,439 --> 00:16:22,733 చాలా హాస్యాస్పదమైన పని. బ్రసియర్లు చాలా మేలు. 269 00:16:24,484 --> 00:16:27,654 మీలాంటి మోడర్న్ వ్యక్తులకు మాది సంకుచిత మనస్థత్వంగా, 270 00:16:27,738 --> 00:16:30,782 మేము పాతకాలపు మనుషులుగా అనిపిస్తుంటాం అనుకుంటా. 271 00:16:31,491 --> 00:16:34,453 మీ ఊరిలో అయితే ఎలా ఉంటుంది? అదే మీ పెద్ద నగరంలో. 272 00:16:35,829 --> 00:16:37,039 అంటే... 273 00:16:38,415 --> 00:16:40,125 వద్దు, వద్దు, వద్దు! 274 00:16:40,209 --> 00:16:43,420 -మన్నించండి. నా ఉద్దేశం, -నేను పాట పాడలేను. 275 00:16:43,504 --> 00:16:46,256 సరే. నాకేమీ చెప్పనక్కర్లేదు. 276 00:16:46,340 --> 00:16:48,842 -సాయంత్రమంతా హాయిగా గడపండి, స్కిన్నర్. -లేదు... 277 00:16:54,389 --> 00:16:56,683 భవిష్యత్తులో, పీట్, 278 00:16:56,767 --> 00:17:00,646 సలసలకాగే చేపల పులుసు దగ్గరికి వెళ్లకు, అర్థమైందా? 279 00:17:00,729 --> 00:17:02,940 నీ గురించి బాగా తెలుసు కాబట్టి చెప్తున్నా. 280 00:17:12,199 --> 00:17:13,242 అబ్బా! 281 00:17:17,412 --> 00:17:20,249 ఇప్పుడు నర్సుగా పని చేస్తున్నావన్నమాట. డాక్టర్ ఎక్కడ? 282 00:17:20,332 --> 00:17:21,290 చేపలను పట్టడానికి బయటకు వెళ్ళాడు. 283 00:17:21,375 --> 00:17:23,085 నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? 284 00:17:24,377 --> 00:17:26,046 నాకు... నేను... 285 00:17:26,128 --> 00:17:27,881 -నీకు నా సాయం కావాలి. -అవును. 286 00:17:27,964 --> 00:17:30,050 నిజంగానా? నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు కానీ, 287 00:17:30,133 --> 00:17:32,219 మనిద్దరం విడిపోయాం, అంతేకాక నువ్వంటే నాకు అసహ్యం కూడా. 288 00:17:32,302 --> 00:17:35,097 తెలుసు, నాకు తెలుసు. కానీ నాకు వేరే దారి లేదు. దయచేసి నాకు సాయపడు. 289 00:17:36,849 --> 00:17:37,891 సరే. ఏం చేయాలి? 290 00:17:37,975 --> 00:17:39,810 సరేమరి, ఈ ఊర్లోని ప్రతీ అమ్మాయితో నేను వంతెనని 291 00:17:39,893 --> 00:17:40,894 దాటాలని చూశాను కదా, నీకు అది గుర్తుందా? 292 00:17:40,978 --> 00:17:43,063 నాకు గుర్తుంది. 293 00:17:43,146 --> 00:17:45,899 ఒక మహిళతో మాత్రం నేను దాటలేదు. అది స్కూల్ టీచర్ అయిన ఎమ్మా టేట్. 294 00:17:45,983 --> 00:17:47,860 కాబట్టి నేను బయటపడటానికి తనే మార్గం అనుకుంటా. 295 00:17:47,943 --> 00:17:49,695 నీకు ఆ స్కూల్ టీచర్ తో నిజమైన ప్రేమ దక్కుతుంది అనుకుంటున్నావా? 296 00:17:49,778 --> 00:17:52,030 ఏమో. నాకు అది సరిగ్గా సాగడంలేదని మాత్రం నాకు తెలుసు. 297 00:17:52,114 --> 00:17:54,408 నిన్న మేం మాట్లాడుకుంటున్నామా, హఠాత్తుగా సంగీతం రావడం మొదలైంది, 298 00:17:54,491 --> 00:17:55,367 తనేమో కోపంగా వెళ్లిపోయింది. 299 00:17:55,450 --> 00:17:57,911 -అప్పుడు నువ్వు పాడాలి కదా మరి. -అవుననుకుంటా. 300 00:17:57,995 --> 00:18:00,998 జోష్, నువ్వు మ్యూజికల్ లో ఉన్నావు. మ్యూజికల్స్ అంటే అలాగే ఉంటాయి మరి. 301 00:18:01,081 --> 00:18:02,791 నీకు భావోద్వేగం ఎక్కువయి మాట్లాడలేకపోతే, నువ్వు పాడతావు. 302 00:18:02,875 --> 00:18:04,626 నీకు భావోద్వేగం ఎక్కువయి పాడలేకపోతే, డాన్స్ వేస్తావు. 303 00:18:04,710 --> 00:18:06,503 మరి భావోద్వేగం ఎక్కువయి డాన్స్ చేయలేకపోతే? 304 00:18:06,587 --> 00:18:08,005 మళ్లీ అది వెనక్కి మాట్లాడటం దగ్గరికే వస్తుందా? 305 00:18:08,088 --> 00:18:10,090 ఎందుకంటే, నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది మరి. 306 00:18:10,174 --> 00:18:12,843 చూడు, దీనికి ఖచ్చితంగా మరో దారి ఉంటుంది. నీకు మ్యూజికల్స్ గురించి తెలుసు కదా. 307 00:18:12,926 --> 00:18:15,721 నాకేమైనా చిట్కాలు ఇవ్వగలవా? అంటే, నేను ఎలాంటి మ్యూజికల్ లో ఉన్నాను అని. 308 00:18:16,805 --> 00:18:20,267 నీకు అస్సలు సాయం చేయకూడదని ఉంది, అదే సమయంలో నా జ్ఞానాన్ని ప్రదర్శించి 309 00:18:20,350 --> 00:18:23,520 షో చేయాలని కూడా నాకు ఉంది, ఈ రెండు ఆలోచనలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి. 310 00:18:24,813 --> 00:18:26,190 అబ్బా. సరేమరి. 311 00:18:26,273 --> 00:18:30,110 తను ఒక చిన్న పిల్లాడిని పెంచుతున్న టీచర్. అది "మ్యూజిక్ మ్యాన్"కి దగ్గరగా ఉంది. 312 00:18:30,194 --> 00:18:31,486 అందులో నేనెవరిని? 313 00:18:31,570 --> 00:18:34,948 హరోల్డ్ హిల్. తానే గొప్పని అనుకొనే విలువలు లేని వ్యక్తి, అతను మారాల్సిన అవసరముంది. 314 00:18:35,032 --> 00:18:36,700 -సరే. -లేదా అది "కింగ్ అండ్ ఐ" కూడా కావచ్చు. 315 00:18:36,783 --> 00:18:38,827 -అందులో నేను... -నువ్వే గొప్ప అని అనుకొనే 316 00:18:38,911 --> 00:18:39,912 విలువలు లేని వ్యక్తివి. 317 00:18:39,995 --> 00:18:42,414 సరే, అది నీకు నా మీద ఉన్న అభిప్రాయం మాత్రమే అని ఇప్పుడు నాకనిపిస్తోంది. 318 00:18:42,497 --> 00:18:44,458 -నువ్వు పాడాలి, జోష్. -అది జరగని పని. 319 00:18:44,541 --> 00:18:47,419 అయితే, ఆ మ్యూజికల్ లో టీచర్ మనస్సును గెలుచుకోవడానికి మ్యూజిక్ మ్యాన్ ఏం చేశాడు? 320 00:18:48,086 --> 00:18:50,547 -ఆమె తమ్ముడికి బాకా ఇచ్చాడు. -ఎందుకు? 321 00:18:51,089 --> 00:18:53,759 ఎవరికి తెలుసు? నాకు తెలీదు. నీకు మొత్తం కథ కావాలా ఏంటి? 322 00:18:53,842 --> 00:18:55,135 -నీ దగ్గర అంత సమయం ఉందా? -పర్వాలేదులే. 323 00:18:55,219 --> 00:18:56,428 బాకా. తమ్ముడు. విషయం అర్థమైపోయింది. 324 00:18:56,512 --> 00:18:58,639 -అందులో ఇంకా చాలా విషయముంది. 325 00:18:58,722 --> 00:19:00,349 -నర్సు మెలిస్సా! -నేను డాక్టర్ ని. 326 00:19:00,432 --> 00:19:02,059 నాకు ప్రసవం అయ్యేలా ఉన్నట్టుంది! 327 00:19:02,142 --> 00:19:03,769 సరే. లోపలికి రా. ప్రసవం చేద్దాం. 328 00:19:03,852 --> 00:19:05,687 -కానీ డాక్ లోపెజ్... -తొక్కలే. 329 00:19:05,771 --> 00:19:07,147 వచ్చి ఈ బల్ల ఎక్కు. 330 00:19:12,402 --> 00:19:13,403 సరే. 331 00:19:13,487 --> 00:19:15,030 నువ్వేం చేస్తున్నావు? 332 00:19:15,113 --> 00:19:16,281 నీకు సాయం అవసరం అవుతుందనుకున్నా. 333 00:19:17,741 --> 00:19:19,284 అవును, అవసరం అవుతుంది. 334 00:19:30,546 --> 00:19:31,755 అది చాలా బాగుంది. 335 00:19:32,881 --> 00:19:34,758 -నువ్వు చాలా బాగా చేశావు. -అదేం లేదులే. 336 00:19:34,842 --> 00:19:36,885 -నిజంగానే బాగా చేశావు. -సరే, ఒప్పుకుంటూన్నా. 337 00:19:36,969 --> 00:19:40,097 కానీ నిజాయితీగా చెప్పాలంటే, మ్యూజికల్ లో ఉండటం వల్ల ఇది చాలా తేలిగ్గా అయిపోయింది. 338 00:19:40,180 --> 00:19:42,850 ఒంటి మీద అస్సలు చెమ్మ అనేదే లేకుండా బిడ్డను నేను బయటకు తీయడం ఇదే తొలిసారి. 339 00:19:42,933 --> 00:19:44,017 అవును, అది వింతగా ఉంది. 340 00:19:44,601 --> 00:19:47,145 కానీ నువ్వు సాయం చేయడం బాగుంది, కనుక నీకు ధన్యవాదాలు. 341 00:19:47,980 --> 00:19:49,356 ఆనందంగా సాయం చేస్తాను. 342 00:19:52,109 --> 00:19:54,361 నువ్వు ఇక బయలుదేరి ఆ బాకాని సంపాదిస్తే మంచిది అనుకుంటా. 343 00:19:55,737 --> 00:19:56,947 అవును. నిజమే. 344 00:19:58,198 --> 00:19:59,324 గుడ్ లక్ మరి. 345 00:20:00,492 --> 00:20:02,578 -నీకు కూడా గుడ్ లక్. -ధన్యవాదాలు. 346 00:20:25,684 --> 00:20:28,812 జనన ధృవపత్రం పేరు: ఫ్రెడ్డీ జూనియర్ 347 00:20:29,813 --> 00:20:31,148 నేను విన్నది నిజమేనా? 348 00:20:31,231 --> 00:20:33,817 నా ఆదేశాలకు విరుద్ధంగా మీరు నాన్సీకి పురుడు పోశారా? 349 00:20:33,901 --> 00:20:35,611 అవును, ఎందుకంటే నేను డాక్టర్ ని. 350 00:20:35,694 --> 00:20:39,489 నిజంగానే. డాక్టర్ల కర్తవ్యం ఏంటో మీకు తెలుసా? 351 00:20:39,573 --> 00:20:40,824 జనాలకు సాయపడటం. 352 00:20:40,908 --> 00:20:42,284 ఆ పని చేయడానికి మీకు అర్హత లేదు. 353 00:20:42,367 --> 00:20:44,953 ఇది నా క్లినిక్, ఇక్కడ నియమాలను నేను రూపొందిస్తాను. 354 00:20:45,037 --> 00:20:47,706 ఇంకో విషయం, ఈ ట్యూబ్ మా తల్లిదండ్రుల మంచం పక్కనున్న అర మీదికి ఎలా చేరుకుంది? 355 00:20:47,789 --> 00:20:48,999 నేనే వాళ్ళకి ఇచ్చాను. 356 00:20:49,625 --> 00:20:53,045 మీకు హద్దులనేవే లేవు. ఓ పద్ధతి లేదు. 357 00:20:55,255 --> 00:20:57,674 నాకు పద్ధతి లేదా? 358 00:20:57,758 --> 00:21:00,260 మీరు చికిత్స చేయాల్సిన అవసరమున్న ఒక మహిళని నిరాదరించారు. 359 00:21:00,344 --> 00:21:04,223 మన్నించాలి. మీరెంత అందంగా ఉన్నా నాకు అనవసరం. 360 00:21:04,306 --> 00:21:06,350 మీ ప్రవర్తన తప్పుగా ఉంది. నాన్సీ విషయంలో, 361 00:21:06,433 --> 00:21:08,393 మీ తల్లిదండ్రుల విషయంలో, అన్నింట్లో కూడా. 362 00:21:08,477 --> 00:21:11,647 మీ తల్లిదండ్రులకు సెక్స్ చేసుకోవాలనుంటే, వాళ్ళని చేసుకోనివ్వండి. 363 00:21:11,730 --> 00:21:13,398 నిజానికి, మీకో విషయం తెలుసా? 364 00:21:13,941 --> 00:21:16,944 మీ తల్లిదండ్రులను సెక్స్ చేసుకోమని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా 365 00:21:17,027 --> 00:21:19,947 వాళ్ళ సెక్స్ జీవితాన్ని మరింత మెరుగుపరిచే మార్గాలను వాళ్ళకి నేను నేర్పుతాను. 366 00:21:20,030 --> 00:21:21,740 కామసూత్రలోని ప్రతీ భంగమని వాళ్లకి నేర్పుతాను. 367 00:21:21,823 --> 00:21:24,576 సంతృప్తి పొందడానికి అసలైన సంతృప్తిని పరిచయం చేస్తాను. 368 00:21:24,660 --> 00:21:29,790 ఇక చివరికి, మీరు ఉన్నా కూడా, వాళ్లు సంతృప్తిగా జీవిస్తారు. 369 00:21:32,626 --> 00:21:35,838 ఇవాళ మనం ఇక్కడికి పెద్దాయన డాక్ లోపెజ్ కి 370 00:21:35,921 --> 00:21:37,339 అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చాము, 371 00:21:37,422 --> 00:21:40,050 "ఈజిప్టియన్ హకుల్బక్" అని పిలవబడే 372 00:21:40,133 --> 00:21:42,970 ఒక కార్యంలో పాల్గొనడం వలన 373 00:21:43,053 --> 00:21:44,596 హఠాత్తుగా ఈ వారంలో ఆయన మనకు దూరమైనారు. 374 00:21:45,889 --> 00:21:48,267 మనందరికీ తప్పకుండా బాధగానే ఉంటుంది, 375 00:21:48,350 --> 00:21:51,979 కానీ లోపెజ్ కుటుంబానికి ఇది మరింత శోకదాయకం అయ్యుంటుంది. 376 00:21:52,938 --> 00:21:55,649 కేవలం రెండేళ్ళ క్రిందటే, హార్హే భార్య, నోర్మా చనిపోయినప్పుడు 377 00:21:55,732 --> 00:21:58,277 ఆమె గురించి నేను ఇక్కడే స్తుతించాను. 378 00:22:00,195 --> 00:22:03,740 మరి, జీవితంలో మనకి ఇలాంటి విషాదాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? 379 00:22:04,950 --> 00:22:08,537 దేవుని ప్రేమ అందనంత దూరాన ఉన్నప్పుడు ఏం చేయాలి? 380 00:22:09,705 --> 00:22:12,291 ఆశ కానరానప్పుడు ఏం చేయాలి? 381 00:22:15,002 --> 00:22:16,628 -హాయ్. -హాయ్. 382 00:22:17,754 --> 00:22:19,006 నువ్వు బాగానే ఉన్నావా? 383 00:22:19,089 --> 00:22:20,382 నా వల్లే ఇలా జరిగింది. 384 00:22:20,465 --> 00:22:24,845 తన సెక్స్ పాటవాన్ని మెరుగుపరుచుకోమని అతడిని ప్రోత్సహించింది నేనే. 385 00:22:24,928 --> 00:22:26,889 ఎలా అయినా, ఆ గుండెపోటు అతనికి ఖచ్చితంగా వచ్చేదే. 386 00:22:26,972 --> 00:22:28,849 నీకు అది తెలుసు కదా? అది బయట పడటానికి లోపల సిద్ధంగా ఉంది. 387 00:22:28,932 --> 00:22:30,809 -ఒకసారి ఓ మేధావి అన్నాడు... -అంతే అనుకుంటా. 388 00:22:32,603 --> 00:22:34,188 తనేనా నీ డాక్టర్? 389 00:22:34,271 --> 00:22:37,649 అతను ఓ మోస్తరుగా అందంగానే ఉన్నాడు. అతని వయస్సు ఉండే మగాళ్ళతో పోలిస్తే. 390 00:22:38,567 --> 00:22:40,485 మీ స్కూల్ టీచర్ తో నీ విషయం ఎంత వరకూ వచ్చింది? 391 00:22:40,569 --> 00:22:42,487 బాకా ఎక్కడా దొరకడంలేదు. 392 00:22:42,571 --> 00:22:45,115 దాని వల్ల తను నాతో ఎలా ప్రేమలో పడుతుందో అన్న విషయం నాకు ఇప్పటికీ అర్థమవ్వడం లేదు. 393 00:22:45,199 --> 00:22:48,118 చూడు, మ్యూజికల్స్ లో రొమాన్స్ కి లాజిక్ అనేది ఎల్లవేళలా ఉండదు. అర్థమైందా? 394 00:22:48,202 --> 00:22:50,787 అందుకే, వాళ్ళు పాటల ద్వారా కథలోని ఎక్కువ భాగాన్ని చెప్తారు. 395 00:22:50,871 --> 00:22:52,080 నేను పాడను కదా. 396 00:22:52,164 --> 00:22:55,167 మన జీవితాలను మనం నిజంగా పరిపూర్ణంగా జీవిస్తున్నామా? 397 00:22:56,710 --> 00:22:59,379 మన మనస్సు చెప్పినట్టు నడుచుకొనే ధైర్యం మనకు ఉందా? 398 00:23:00,339 --> 00:23:03,842 అలాగే దేవుడు మనకి ప్రసాదించిన వాటినన్నింటినీ మనం ఉపయోగించుకుంటున్నామా? 399 00:23:03,926 --> 00:23:07,221 అతను చాలా బాగా చెప్పాడు కదా? మన మనస్సు చెప్పినట్టు నడుచుకోవడం గురించి. 400 00:23:08,472 --> 00:23:11,892 నాకూ అలాగే ఉండాలని ఉంది. అలానే ఉండేవాడిని. కానీ... 401 00:23:11,975 --> 00:23:16,063 ఎందుకంటే, ఈ భూమి మీద మనం సాగించే ఈ చిన్ని యాత్ర మనకి దేవుడు ప్రసాదించినదే. 402 00:23:17,022 --> 00:23:20,567 మరి అందులో ఒక్క నిమిషం అయినా మనం వృథా చేయడం ఆయనకి నచ్చదు. 403 00:23:22,694 --> 00:23:23,904 ఓ మాట చెప్పనా? 404 00:23:24,988 --> 00:23:25,989 నువ్వన్నది నిజమే. 405 00:23:26,073 --> 00:23:29,701 ఒకసారి ఒక మేధావి అన్నాడు, "నక్షత్రాలు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి... 406 00:23:30,702 --> 00:23:33,622 -కానీ రాత్రివేళల్లో మాత్రమే"... -అయ్యో. నా ఉద్దేశం ఇప్పుడే అని కాదు. 407 00:23:33,705 --> 00:23:36,542 రెవరెండ్, నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. 408 00:23:36,625 --> 00:23:37,918 తప్పకుండా, మేయర్ గారు. 409 00:23:41,296 --> 00:23:42,756 రెవరెండ్ చెప్పింది నిజమే. 410 00:23:43,465 --> 00:23:46,969 జీవితం అమూల్యమైనది, అందులో ఒక్క నిమిషం కూడా మనం వృథా చేయకూడదు. 411 00:23:48,720 --> 00:23:49,805 కాబట్టి... 412 00:23:50,514 --> 00:23:53,934 ఎన్నో ఏళ్లుగా నేను మీకొక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను... 413 00:23:55,018 --> 00:23:56,603 కానీ నాకు ధైర్యం సరిపోలేదు. 414 00:23:58,397 --> 00:23:59,398 ఫ్లోరెన్స్, 415 00:24:00,148 --> 00:24:02,568 నా బంగారం, నాకు నువ్వంటే ప్రాణం. 416 00:24:04,069 --> 00:24:05,070 కానీ... 417 00:24:06,655 --> 00:24:09,157 నేను స్వలింగసంపర్కుడిని. 418 00:24:11,535 --> 00:24:12,744 ఏంటి? 419 00:24:14,913 --> 00:24:19,960 నేను స్వలింగ సంపర్కుడిని 420 00:24:20,043 --> 00:24:25,340 అది ఇక రహస్యమైన విషయమేమీ కాదు 421 00:24:25,424 --> 00:24:27,801 నేను మగాళ్ళకు ఆకర్షితుడనవుతాను 422 00:24:28,427 --> 00:24:32,890 మగాళ్లంటే మీరు కాదు మీలో ఆ తేజస్సు లేదు 423 00:24:34,099 --> 00:24:41,064 కానీ నేను స్వలింగ సంపర్కుడిని 424 00:24:47,446 --> 00:24:48,864 ఫ్లోరెన్స్, ఆగు! 425 00:25:00,792 --> 00:25:03,462 -హేయ్, కార్సన్. -హేయ్, డాక్టర్ స్కిన్నర్. 426 00:25:03,545 --> 00:25:05,255 నీకోసం ఒకటి తెచ్చాను. 427 00:25:07,382 --> 00:25:08,383 ఏంటిది? 428 00:25:08,467 --> 00:25:09,593 అదో పీక. 429 00:25:09,676 --> 00:25:12,221 నీకు బాకా అయితే నచ్చేదని నాకు తెలుసు, కానీ అవి ఊరిలో ఎక్కడా దొరకలేదు. 430 00:25:12,304 --> 00:25:13,764 అదీగాక, ఈ పీకలు వాటి కన్నా చాలా మేలు, 431 00:25:13,847 --> 00:25:16,266 ఎందుకంటే, నువ్వు నేర్చుకోవడం కానీ, సాధన కానీ ఇంకేమీ చేయనక్కర్లేదు. 432 00:25:16,350 --> 00:25:18,560 నువ్వు దానిలోకి ఊదితే చాలు, దాని నుండి సంగీతం బయటకు వస్తుంది. 433 00:25:23,398 --> 00:25:25,359 ఇతర పిల్లలు నన్ను చూసి ఎగతాళి చేస్తారు. 434 00:25:26,109 --> 00:25:29,488 -ఎందుకలా అన్నావు? -ఎందుకంటే వాళ్ళెప్పుడూ అదే చేస్తారు కనుక. 435 00:25:29,571 --> 00:25:32,574 నాతో ఎవరూ కలవరు. నేను అందరిలో కలవగలిగే రకం కాదనుకుంటా. 436 00:25:35,160 --> 00:25:36,495 నీకెలా అనిపిస్తుందో నేను అర్థం చేసుకోగలను. 437 00:25:37,162 --> 00:25:38,622 -నిజంగానా? -అవును. 438 00:25:38,705 --> 00:25:41,166 నేను వైద్య కళాశాలలో ఉన్నప్పుడు, నేను కూడా అందరితో కలవలేకపోయేవాడిని. 439 00:25:41,250 --> 00:25:43,544 మా తరగతిలో నాలాంటి వ్యక్తి కనీసం ఒక్కరు కూడా ఉండేవారు కాదు. 440 00:25:43,627 --> 00:25:46,922 నిజం చెప్పాలంటే, ఒక్కోసారి నాకు చాలా ఒంటరితనంగా అనిపించేది. 441 00:25:47,005 --> 00:25:49,258 కానీ నేనేం చేశానో తెలుసా? "వాళ్ళ మొహం," అని అనుకున్నాను. 442 00:25:49,341 --> 00:25:50,509 "వాళ్ళ మొహమా"? 443 00:25:52,970 --> 00:25:56,306 వాళ్లు ఏం అనుకున్నా పట్టించుకోవలసిన అవసరం లేదని నేను గ్రహించాను. 444 00:25:56,390 --> 00:25:58,392 నేను ఏమనుకుంటున్నాను అనేదే ముఖ్యం. 445 00:25:58,475 --> 00:26:01,270 కాబట్టి నేను కష్టపడ్డాను, డాక్టర్ అయ్యాను, 446 00:26:01,353 --> 00:26:03,355 ఇప్పుడు నాకు లెక్కలేనంత మంది స్నేహితులు ఉన్నారు. 447 00:26:03,981 --> 00:26:07,526 వాళ్లలో ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు అయిన కర్మేలో ఆంథోనీ కూడా ఒక్కడు, 448 00:26:07,609 --> 00:26:11,822 అతని మోకాలికి నేను ఓసారి చికిత్స చేశాను, దానితో నాకు కోర్ట్ సైడ్ సీట్లు ఇప్పించాడు. 449 00:26:11,905 --> 00:26:15,409 ఆ సీటు ధర ఒక్కొక్కటీ 2,500 డాలర్ల దాకా ఉంటుంది. 450 00:26:15,492 --> 00:26:17,703 -వావ్! -అవును. అందుకని, కమాన్. 451 00:26:18,912 --> 00:26:19,913 ఓసారి వాయించి చూడు. 452 00:26:25,878 --> 00:26:27,087 అంతే. 453 00:26:30,340 --> 00:26:32,467 వావ్! నేను సాధించాను! నేను సంగీతం వాయించగలను! 454 00:26:33,260 --> 00:26:36,180 -అక్కా! అక్కా! అక్కా! -ఏంటి? 455 00:26:36,263 --> 00:26:38,891 డాక్టర్ స్కిన్నర్ నాకు ఒక అద్భుతమైన వస్తువు ఇచ్చాడు! 456 00:26:38,974 --> 00:26:41,518 ఒక పీక! చూడు, నేను సంగీతం వాయించగలను! 457 00:26:46,690 --> 00:26:48,066 అది చాలా గొప్ప విషయం! 458 00:26:52,571 --> 00:26:53,780 సూపర్, ఇది పనిచేసింది. 459 00:27:07,920 --> 00:27:08,921 డాక్టర్? 460 00:27:11,089 --> 00:27:12,090 మీరు బాగానే ఉన్నారా? 461 00:27:13,634 --> 00:27:17,846 మెలిస్సా. మన్నించాలి, ఇక్కడ నిలబడి ఏదో ఆలోచనలో మునిగిపోయాను, అంతే. 462 00:27:18,889 --> 00:27:20,140 ఈ రోజు మామూలు రోజు కాదు. 463 00:27:21,266 --> 00:27:24,061 నాకు మీ భార్య గురించి తెలియదు. 464 00:27:24,144 --> 00:27:27,439 నేను చాలా చింతిస్తున్నాను. మీరు ఆమెని చాలా ప్రేమించి ఉంటారు. 465 00:27:28,398 --> 00:27:30,192 అవును. 466 00:27:30,275 --> 00:27:34,571 ఇంకా మీ నాన్న విషయంలో నేను చాలా బాధ పడుతున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 467 00:27:35,364 --> 00:27:38,033 ఆయన చనిపోవడానికి కారణం నేనే అని నాకు అనిపిస్తూ ఉంది. 468 00:27:38,116 --> 00:27:40,869 అదేం కాదు. మెలిస్సా, మిమ్మల్ని మీరు ఎప్పటికీ నిందించుకోకూడదు. 469 00:27:40,953 --> 00:27:42,329 ఎప్పటికీ నిందించుకోకూడదు. 470 00:27:42,412 --> 00:27:46,416 మీ వల్లనే, ఆయన తన ఆఖరి క్షణాలను ఆనందంతో, ఇంకా ప్రేమతో గడపగలిగాడు. 471 00:27:47,751 --> 00:27:49,878 నేనేమీ చేయలేకపోయాను. అవును. 472 00:27:49,962 --> 00:27:52,840 డాక్టర్ హార్హే సెబాస్టియన్ ఫెడెరీకో లోపెజ్ అయన నేను, 473 00:27:52,923 --> 00:27:56,218 అందరినీ నియంత్రించే పరిపూర్ణుడను, ఎవరి జీవితాలను వాళ్లకే వదిలేయలేనివాడిని. 474 00:27:56,301 --> 00:27:59,304 ఆ నా గుణం నాకు అస్సలు నచ్చదు. ఏమాత్రం నచ్చదు. 475 00:27:59,388 --> 00:28:03,934 ఆ లక్షణాలలో సానుకూల అంశాలు కూడా ఉన్నాయి అనుకోండి. 476 00:28:04,017 --> 00:28:05,602 నాకు కూడా నేను అదే చెప్పుకున్నాను. 477 00:28:05,686 --> 00:28:08,689 ఆ సమయమంతా, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, వారి జీవితాలలో సుఖం లేకుండా చేశాను. 478 00:28:09,731 --> 00:28:13,527 కానీ తర్వాత మీరొచ్చారు, నన్ను ఎదిరించారు, మీ మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్తారు. 479 00:28:13,610 --> 00:28:16,071 మొదట్లో నాకు అది అస్సలు నచ్చలేదన్న మాట వాస్తవమే, 480 00:28:16,154 --> 00:28:17,573 కానీ ఇప్పుడు నేను గ్రహించాను... 481 00:28:18,907 --> 00:28:20,158 మీరు కరెక్ట్ అని. 482 00:28:20,784 --> 00:28:23,620 నేను పొరబడ్డాను అని. అన్ని విషయాలలో కూడా. 483 00:28:23,704 --> 00:28:27,833 ఇంతవరకూ ఏ మగాడు కూడా నాతో ఇంత మధురంగా చెప్పలేదు. 484 00:28:27,916 --> 00:28:30,252 మీరు నన్ను మార్చారు, మెలిస్సా. 485 00:28:31,503 --> 00:28:32,504 ధన్యవాదాలు. 486 00:28:38,760 --> 00:28:40,304 అసలు ఇది ఎలా పని చేస్తుందో ఏమో? 487 00:28:43,015 --> 00:28:44,016 ఏమైనా ఫలితం దక్కిందా? 488 00:28:45,517 --> 00:28:46,518 లేదు. 489 00:28:48,437 --> 00:28:50,522 నా అంత చెత్త సహాయకుడు ఎవ్వరూ ఉండరేమో. 490 00:28:50,606 --> 00:28:52,232 పనిలో చేరి వారమైంది, ఇప్పటిదాకా ఒక్కదాన్ని కూడా బాగుచేయలేదు. 491 00:28:52,316 --> 00:28:53,483 కార్సన్ ని తప్ప. 492 00:28:54,318 --> 00:28:56,320 వాడికి సాయపడినందుకు ధన్యవాదాలు. 493 00:28:57,196 --> 00:29:00,866 తల్లిదండ్రులు లేకుండా వాడు సరిగ్గా పెరగలేకపోతున్నాడు. 494 00:29:01,491 --> 00:29:04,161 జీవితంలోని ముఖ్యమైన విషయాలను వాడికి పరిచయం చేసే ప్రయత్నం చేశాను. 495 00:29:04,244 --> 00:29:09,041 జాలి, చిత్తశుద్ధి, ఇవిగాక ఇంకో విషయం ఎప్పుడూ కూడా ఉండాలి అని. 496 00:29:09,124 --> 00:29:12,211 కానీ చాలా విషయాలను వాడికి దూరం చేశానని తెలిసిపోతుంది. 497 00:29:12,294 --> 00:29:13,837 హేయ్, అలా మిమ్మల్ని మీరు నిందించుకోకండి. 498 00:29:13,921 --> 00:29:16,465 అతను చాలా గొప్ప పిల్లాడు, మీ వల్లనే వాడు అలా కాగలిగాడు. 499 00:29:16,548 --> 00:29:18,383 ఈ ఊర్లోని చాలా మంది ఆ విషయాన్ని ఒప్పుకోరు. 500 00:29:18,467 --> 00:29:19,718 ఎవరేమనుకుంటే ఏంటి? 501 00:29:20,552 --> 00:29:22,387 వాళ్లందరూ ఏకమై వచ్చినా మీ అంత గొప్పవాళ్ళు కాలేరు. 502 00:29:25,057 --> 00:29:26,934 జోష్ స్కిన్నర్. 503 00:29:27,017 --> 00:29:29,478 మీరు ఎలాంటి మనిషని నేననుకున్నానో, దానికి మీరు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. 504 00:29:31,522 --> 00:29:32,606 డాక్టర్? 505 00:29:32,689 --> 00:29:35,609 మెలిస్సా, ఇవాళ మేయర్ చేసింది చూసి నేను కూడా స్ఫూర్తి పొందాను. 506 00:29:36,860 --> 00:29:40,572 ఇది మీరు ఊహించనిది అని నాకు తెలుసు, కానీ నాకు ఒక్క నిమిషం కూడా వృథా చేయాలని లేదు. 507 00:29:41,365 --> 00:29:46,870 నాలోని ఆలోచనలన్నీ 508 00:29:47,538 --> 00:29:53,126 ఉన్నట్టుండి నేను మాటిమాటికీ మర్చిపోతున్నాను 509 00:29:53,210 --> 00:29:58,131 అది పరమ పిచ్చి చర్య అని నాకు తెలిసినప్పటికీ 510 00:29:58,799 --> 00:30:04,346 ఉన్నట్టుండి పెళ్లి ఏర్పాట్లు చేయాలని నాకనిపిస్తోంది 511 00:30:05,013 --> 00:30:10,018 ఏంటి, ఎక్కడ, ఎందుకు ఎప్పుడు, ఎలా అని 512 00:30:10,936 --> 00:30:16,149 వివరించే ప్రయత్నం చేసి లాభం లేదు 513 00:30:16,859 --> 00:30:22,364 నాకు తెలిసిందల్లా ఉన్నట్టుండి మీ మీద నాకు ప్రేమ పుట్టుకొచ్చిందని 514 00:30:23,031 --> 00:30:29,955 ఇంకా ఉన్నట్టుండి అంత కన్నా ముఖ్యమైన విషయం నాకు మరొకటి లేదని 515 00:30:31,164 --> 00:30:34,501 -ఎమ్మా... -ఇది అనుకోకుండా జరిగిందనిపిస్తే, అది నిజం. 516 00:30:35,335 --> 00:30:37,671 కానీ ఇవాళ అంత్యక్రియల సమయంలో జరిగిన విషయాన్ని గమనించాక, 517 00:30:37,754 --> 00:30:40,924 ఈ విషయాన్ని నాలోనే దాచుకోవడం తప్పుగా అనిపిస్తోంది. 518 00:30:41,508 --> 00:30:46,763 ఉన్నట్టుండి నేను టీచర్ ని కాదు అన్నట్టు నాకు అనిపిస్తోంది 519 00:30:47,389 --> 00:30:51,935 నేను నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉందని అనిపిస్తోంది 520 00:30:53,061 --> 00:30:58,567 ఉన్నట్టుండి ఒక బోధకుడిని పిలవాలని నాకనిపిస్తోంది 521 00:30:58,650 --> 00:31:03,739 కానీ అలాంటి ఆలోచనలు నాకు అస్సలు నచ్చేవే కాదు 522 00:31:04,781 --> 00:31:10,120 ఏంటి, ఎక్కడ, ఎందుకు ఎప్పుడు, ఎలా అని 523 00:31:10,662 --> 00:31:15,959 వివరించే ప్రయత్నం చేసి లాభం లేదు 524 00:31:16,752 --> 00:31:22,758 నాకు తెలిసిందల్లా ఉన్నట్టుండి మీ మీద నాకు ప్రేమ పుట్టుకొచ్చిందని 525 00:31:22,841 --> 00:31:29,431 ఇంకా ఉన్నట్టుండి అంత కన్నా ముఖ్యమైన విషయం నాకు మరొకటి లేదని 526 00:31:59,002 --> 00:32:04,758 ఏంటి, ఎక్కడ, ఎందుకు ఎప్పుడు, ఎలా అని 527 00:32:04,842 --> 00:32:10,514 వివరించే ప్రయత్నం చేసి లాభం లేదు 528 00:32:11,390 --> 00:32:17,938 నాకు తెలిసిందల్లా ఉన్నట్టుండి మీ మీద నాకు ప్రేమ పుట్టుకొచ్చిందని 529 00:32:18,605 --> 00:32:23,902 ఇంకా ఉన్నట్టుండి అంత కన్నా ముఖ్యమైన విషయం 530 00:32:23,986 --> 00:32:27,239 నాకు మరొకటి లేదని 531 00:32:48,927 --> 00:32:52,806 -మీరు మీ పనిని -మీరు మీ పనిని 532 00:32:52,890 --> 00:32:56,226 -మీ మనస్సంతా పెట్టి చేయాలి -మీ మనస్సంతా పెట్టి చేయాలి 533 00:32:56,310 --> 00:32:57,686 మొదలుపెట్టినదాన్ని 534 00:32:57,769 --> 00:32:59,563 -పూర్తిచేసిన అమ్మాయిలు, అబ్బాయిలకే -అమ్మాయిలు, అబ్బాయిలకే 535 00:32:59,646 --> 00:33:03,233 -జీవితంలో గొప్ప సంతృప్తి దక్కుతుంది -ద-క్కు-తుం-ది! 536 00:33:03,317 --> 00:33:10,032 కాబట్టి నా బాధ్యతగా నేనొక మంచి సలాహా ఇస్తున్నాను 537 00:33:10,115 --> 00:33:14,912 నువ్వు ఎప్పుడూ కూడా నీకు చేతనైనంత కృషి చేయాలి 538 00:33:50,989 --> 00:33:53,534 కాబట్టి నా బాధ్యతగా 539 00:33:53,617 --> 00:33:56,036 నేనొక మంచి సలాహా ఇస్తున్నాను 540 00:33:56,119 --> 00:33:58,622 నువ్వు ఎప్పుడూ కూడా నీకు చేతనైనంత కృషి చేయాలి 541 00:33:58,705 --> 00:34:01,124 జీవితం నిన్ను ఎన్నిసార్లు పరీక్షించినా 542 00:34:01,208 --> 00:34:05,838 నువ్వు ఎప్పుడూ కూడా నీ మనస్సు పెట్టి 543 00:34:05,921 --> 00:34:07,172 నీకు చేతనైనంత 544 00:34:07,256 --> 00:34:10,759 -కృషి చేయాలి -కృ-షి! 545 00:34:10,842 --> 00:34:12,844 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య